అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం

విద్యను .. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థినీ విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని .. తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్ధిస్తుంటారు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనసు ప్రశాంతతను పొందుతుంది. ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి .. తెల్లని పూలతో అలకరించబడి .. తెల్లని వీణను ధరించి ఉంటుంది. తెలుపు స్వచ్ఛతకు .. పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది. అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన, వెంటనే మనసుకి ప్రశాంతత లభిస్తుంది.

 విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే, ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. సరస్వతీ దేవికి పాలు .. పెరుగు .. వెన్న .. తేనె .. పాయసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి ఈ నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.            


More Bhakti News