ప్రదోష వేళలో శివారాధన ఫలితం!

పరమశివుడు దయా సాగరుడు .. అంకిత భావంతో ఆరాధిస్తే చాలు ఆనందంతో అనుగ్రహిస్తాడు. అనునిత్యం ఆ స్వామిని పూజించడం వలన, సమస్త శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రదోష వేళలో స్వామిని పూజించడం వలన, విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి. సూర్యాస్తమయమయ్యాక ఒక గంటసేపు గల సమయాన్ని ప్రదోష సమయమని చెబుతారు.

 ప్రతిరోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషమనీ .. ప్రతి నెల పౌర్ణమికి ముందు వచ్చే ప్రదోషాన్ని పక్ష ప్రదోషమనీ .. అమావాస్యకి ముందు వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషమని అంటారు. ప్రదోష సమయంలో పరమశివుడు .. పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తుంటాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు అక్కడే వుంటారు. ఆ సమయంలో శివ పూజ చేయడం వలన, పార్వతీ పరమేశ్వరులు ఎంతో ప్రీతి చెందుతారట. ఆ సమయంలో చేసే పూజ వలన శివపార్వతులతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.          


More Bhakti News