వాహన దేవతలకి నమస్కరించాలి!

చాలామంది ఉదయాన్నే దైవ దర్శనం చేసుకుని, తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. మరికొంతమంది విశేషమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. దేవాలయానికి వెళ్లినప్పుడు ముందుగా ప్రధాన దేవతల దర్శనం చేసుకుని .. ఆ తరువాత పరివార దేవతలను దర్శించుకుంటూ వుంటారు. ప్రధాన దేవతల వాహనాలకు కూడా భక్తితో నమస్కరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 వైష్ణవ ఆలయాలలో స్వామివారికి ఎదురుగా గరుత్మంతుడు కొలువై ఉంటాడు. అలాగే శివాలయాలలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. అలాగే శక్తి ఆలయాలలో అమ్మవారికి ఎదురుగా సింహం ఉంటుంది. ఇక కుమారస్వామి ఆలయాలలో స్వామివారికి ఎదురుగా నెమలి .. వినాయకుడికి ఎదురుగా మూషికం .. హనుమంతుడికి ఎదురుగా ఒంటె వుంటాయి. ఇవన్నీ కూడా అనునిత్యం .. అనుక్షణం దేవతల సేవలో తరించేవే. అందువలన ప్రధాన దేవతలతో పాటు .. వాహన దేవతలకి కూడా భక్తితో నమస్కరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.     


More Bhakti News