చింతామణి గణపతి ప్రత్యేకత

ప్రాచీన కాలం నుంచి వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ వస్తున్నాడు. వినాయకుడు ప్రధాన దైవంగా కొలువైన క్షేత్రాలు మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ప్రతి ఆలయంలోను వినాయకుడి మూర్తి తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు మొదలు పెద్దల వరకూ అంతా వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. అలా వినాయకుడు ఆవిర్భవించిన క్షేత్రాలలో మహారాష్ట్ర ప్రాంతంలోని పూణె జిల్లాలోని 'ధేవూర్' ఒకటి. అష్ట గణపతి క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోన్న ఇక్కడి గణపతిని .. 'చింతామణి' గణపతిగా భక్తులు కొలుచుకుంటూ వుంటారు.

ఇక్కడి గణపతికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు 'చింతామణి' ఉండేది. రాజ వంశానికి చెందిన గణరాజు .. ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును వినాయకుడు సంహరించి, ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగిస్తాడు. కపిలుడి కోరిక మేరకు వినాయకుడు ఇక్కడ కొలువుదీరాడు. అందువల్లనే ఇక్కడి స్వామిని చింతామణి గణపతిగా పూజిస్తుంటారు. 


More Bhakti News