అందుకే గణపతి మయూరేశ్వరుడు!

ప్రాచీన కాలం నుంచి గణపతి తొలి పూజలు అందుకుంటూ వస్తున్నాడు. భక్తుల కోరిక మేరకు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించిన వినాయకుడు, అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి కొలువైన ప్రదేశాలు మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. మహారాష్ట్రలో వినాయకుడు ఆవిర్భవించిన మోర్ గామ్ .. సిద్ధిటెక్ .. పాలీ .. మహాడ్ .. ధేవూర్ .. లేన్యాద్రి .. ఓఝర్ .. రంజన్ గామ్ అనే ప్రదేశాలు అష్ట గణపతి క్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఒక్కో క్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.

 మరాఠీలో 'మోర్' అంటే నెమలి అని అర్థం. అందుకే ఈ ప్రదేశానికి 'మోర్ గామ్' అని పేరు. పూర్వం వినాయకుడు ఇక్కడ 'నెమలి వాహనం'పై సంచరించేవాడని అంటారు.  అందుకే ఆయనని 'మయూరేశ్వరుడు'గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు.   నెమలి వాహనంపైcవినాయకుడు సంచరిస్తూనే, కమలాసురుడు .. సింధురాసురుడు అనే అసురులను సంహరించాడు. లోక కల్యాణం కోసం వినాయకుడు యుద్ధం చేసిన కారణంగా, దేవతల కోరికపై 'విశ్వకర్మ' ఇక్కడ స్వామి మూర్తిని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది.    


More Bhakti News