చైత్ర పౌర్ణమి ప్రత్యేకత!

సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. పౌర్ణమి రోజున చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా 'చైత్ర పౌర్ణమి' కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుని 'మహా చైత్రి'గా పిలవబడుతోంది. ఈ రోజున శివ పార్వతుల కల్యాణాన్ని జరిపించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

 శివపార్వతుల కల్యాణోత్సవాన్ని తిలకించినా పాపాలు పటాపంచలై .. పుణ్య ఫలాల రాశి పెరుగుతుందని అంటారు. దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెబుతారు. మహా శివ భక్తురాలైన అక్క మహాదేవి ఈ రోజునే జన్మించింది. 12 వ శతాబ్దానికి చెందిన అక్కమహాదేవి సాక్షాత్తు పరమ శివుడిని తన భర్తగా భావించి, ఆ స్వామి సేవకి జీవితాన్ని అంకితం చేసింది. వీర శైవులు అక్కమహాదేవి జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ .. ఆమెను ఆరాధిస్తూ తరిస్తుంటారు.          


More Bhakti News