శ్రీరామ రక్షా స్తోత్ర పఠన ఫలితం!

లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలా ఆయన చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు గా జన్మించాడు. ఆ పర్వదినాన్నే 'శ్రీరామ నవమి'గా జరుపుకుంటూ ఉండటం అనాదిగా వస్తోంది. ఈ రోజున భక్తులంతా ఇంటిని ..పూజా మందిరాన్ని శుభప్రదంగా అలంకరిస్తారు.  శ్రీరామ పట్టాభిషేక ఘట్టానికి సంబంధించిన చిత్ర పటాన్ని పూజా మందిరాన వుంచి, తెల్లని పూలతో సీతారాములను అర్చిస్తారు.

ఆ స్వామికి వడపప్పు - పానకం నైవేద్యంగా సమర్పించి, వాటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరిస్తారు. దేవాలయాలకి వెళ్లి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించి తరిస్తుంటారు. ఈ రోజున శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వలన, అనేక దోషాలు .. పాపాలు నశించిపోతాయి. అనారోగ్యాలు .. ఆపదలు దూరమవుతాయి. సిరి సంపదలు .. సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.     


More Bhakti News