భగవంతుడి పరీక్షలో నెగ్గాలి
దేవాలయాలకు వెళ్లడం .. దైవదర్శనం చేసుకోవడం .. మనసులోని ధర్మబద్ధమైన కోరికలను చెప్పుకోవడం అంతా చేస్తుంటారు. అయితే భగవంతుడు అడిగినవన్నీ ఇచ్చేయడు .. అవసరమైనవి మాత్రమే ఇస్తాడు. భగవంతుడు ఒక కోరికను నెరవేర్చేటప్పుడు అది ఆ భక్తుడికి ఎంతవరకూ అవసరమో చూస్తాడు. ఆ కోరిక నెరవేరడం .. అతని భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచన చేసి మరీ అనుగ్రహిస్తాడు.
భక్తులు అడిగిన కోరికలను నెరవేర్చడానికి ముందు దైవం వాళ్లని పరీక్షిస్తుందనే విషయం చాలా మంది భక్తుల విషయంలో స్పష్టమైంది. భగవంతుడు తన పరీక్షలో నెగ్గిన భక్తుల కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. ముఖ్యంగా దత్తాత్రేయుడు తన భక్తుల కోరికలను నెరవేర్చడానికి ముందు, వాళ్లలో దానగుణం ఎంతలా ఉందో చూస్తాడట. జీవుల పట్ల జాలి .. ప్రేమను కలిగివుండటాన్ని ఆయన కోరుకుంటాడట. భక్తులలో అవి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఆయన అనేక రూపాలను ధరిస్తూ ఉంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.