ఫాల్గుణ ఏకాదశి ప్రత్యేకత

ఇరవై నాలుగు ఏకాదశులలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత వుంది. అలాగే ఫాల్గుణ ఏకాదశి రోజున కూడా ఒక ప్రత్యేకత వుంది. శ్రీరామచంద్రుడు సేతువు నిర్మాణాన్ని ప్రారంభించింది ఈ రోజునే అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకకి తీసుకువెళతాడు. రాక్షసుల కాపలాలో ఆమెను ఉంచుతాడు. విషయం తెలుసుకున్న రాముడు .. వానర సైన్యంతో లంకపైకి దండెత్తుతాడు.

 సముద్ర తీరానికి చేరుకున్న ఆయన, అవతలి తీరానికి చేరుకోవడానికి గాను సేతువును నిర్మించాడు. అలా సేతువు నిర్మాణాన్ని ఆయన ఆరంభించింది ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజునే. మిగతా ఏకాదశుల మాదిరిగానే .. ఈ ఏకాదశి రోజున కూడా శ్రీ మహా విష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి ఉంటుంది. స్వామి నామస్మరణ .. కీర్తనలతో ఉపవాసం - జాగరణ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని అంటారు.       


More Bhakti News