బంగారు శివలింగాన్ని పూజించే కుబేరుడు
శివలింగ అర్చన .. ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అందువలన దేవతలు .. మహర్షులు .. భక్తులు శివలింగాన్ని పూజిస్తూ వుంటారు. ఆ సదాశివుడి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. శివుడు ఒకడే అయినా ఒక్కో విధమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితాన్ని పొందేలా ఆయన అనుగ్రహించాడు.
మట్టితోను .. పిండితోను .. అన్నంతోను .. రాగితోను .. వెండితోను .. బంగారంతోను చేయబడిన శివలింగాలను పూజించడం వలన వివిధ రకాల ఫలితాలను పొందడం జరుగుతుంది. అలా 'బంగారు శివలింగం'ను పూజించడం వలన సిరిసంపదలు చేకూరతాయి. 'కుబేరుడు' అనునిత్యం బంగారు శివలింగాన్ని ఆరాధిస్తాడట. అందువల్లనే ఆయన సంపదలకు అధిపతి అయ్యాడు. మరింత సంపదలను కోరుకునేవారు బంగారు శివలింగాన్ని భక్తితో పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.