శివకేశవులు కొలువైన ఆలయం

దేవాలయం .. మానసిక ప్రశాంతతకు నిలయం. భగవంతుడి సన్నిధిలో మనసులోని మాటను చెప్పుకోవడం జరుగుతుంది. దాంతో మనసులోని భారం తీరినట్టు అవుతుంది. భగవంతుడు తోడుగా ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుడి నామ స్మరణ .. దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. అందువలన చాలామంది ఆలయ దర్శనం చేస్తుంటారు.

 అలాంటి ఆలయాలలో శివకేశవులు కొలువుదీరిన ఆలయాలు కొన్ని కనిపిస్తాయి. అలా పరమ శివుడు .. శ్రీరామచంద్రుడు కొలువైన ఆలయం ఒకటి హైదరాబాద్ - దిల్ సుఖ్ నగర్ లోని కమలానగర్ లో దర్శనమిస్తుంది. ఇక్కడ తీర్చిదిద్దబడినట్టుగా కనిపించే ఆలయంలో ఒక వైపున శ్రీ సీతారామచంద్ర స్వామి .. మరో వైపున శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తుంటారు. సోమ .. శనివారాల్లోను, విశేషమైన పర్వదినాల్లోను ఈ ఆలయ దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ ఆలయ దర్శనం చేయడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.   


More Bhakti News