పాపాలను హరించే మాధవుడు

పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుడిని సంహరించాడు. ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి గాను శ్రీమహా విష్ణువును ప్రార్ధించాడు. భూలోకంలో అయిదు ప్రదేశాల్లో 'మాధవస్వామి'ని ప్రతిష్ఠించి పూజించమని ఆయన చెప్పాడట. దాంతో దేవేంద్రుడు కాశీలో 'బిందుమాధవ స్వామి'ని .. ప్రయాగలో 'వేణుమాధవ స్వామి'ని .. రామేశ్వరం లో 'సేతుమాధవ స్వామి'ని .. కేరళలో 'సుందర మాధవ స్వామి'ని .. పిఠాపురంలో 'కుంతీ మాధవస్వామి'ని ప్రతిష్ఠించి ఆరాధించాడు.

అలా దేవేంద్రుడు తాను చేసిన పాపం నుంచి విముక్తుడయ్యాడు. ఈ క్షేత్రాలన్నీ కూడా 'పంచ మాధవ' క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ క్షేత్రాలకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వలన, పాపాల నుంచి విముక్తిని పొందడం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.        


More Bhakti News