లేన్యాద్రి గణపతి క్షేత్రం ప్రత్యేకత!

భక్తితో కొలిస్తే చాలు .. అంకితభావంతో అర్చిస్తే చాలు .. అమ్మలా అనుగ్రహించే దైవంగా వినాయకుడు కనిపిస్తాడు. అడిగినంత మాత్రాన్నే ఆటంకాలు తొలగించే వినాయకుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఆ క్షేత్రాలన్నీ కూడా ఎప్పుడూ భక్తజన సందోహంతో సందడి చేస్తూ కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాలలో మహారాష్ట్రలోని 'లేన్యాద్రి' ఒకటి. ఇది పూణే జిల్లా 'గోలేగామ్'లోని కొండపై వుంది.

 పుత్రుడి కోసం పార్వతీ దేవి ఇక్కడి కొండపై కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిందని స్థల పురాణం చెబుతోంది. ఆమె నలుగు పిండితో బొమ్మను చేసి .. ప్రాణం పోసిన ప్రదేశం ఇదేనని అంటారు. తన ఆటపాటలతో పార్వతీ దేవికి వినాయకుడు ఆనందాన్ని కలిగించినది ఇక్కడేనని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడి వినాయకుడిని 'గిరిజాత్మజుడు'గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు .. మనసారా కొలుచుకుంటూ వుంటారు.


More Bhakti News