సూర్యచంద్రులు చేసే శివార్చన!

పరమశివుడు లోక కల్యాణ కారకుడు. ఆయన అనుగ్రహంతోనే సృష్టిలోని సమస్త జీవరాశి మనుగడ కొనసాగిస్తున్నది. అలాంటి పరమశివుడిని బ్రహ్మ .. విష్ణు మొదలు ఇంద్రాది దేవతలు అనునిత్యం పూజిస్తూ వుంటారు. సమస్త విశ్వానికి రెండు కళ్లుగా చెప్పుకునే సూర్యచంద్రులు కూడా ఆదిదేవుడిని అనునిత్యం ఆరాధిస్తూ వుంటారు.

 లోకానికి వెలుగులను ప్రసరింపజేసే సూర్య భగవానుడు అనునిత్యం రాగి లింగాన్ని పూజిస్తూ ఉంటాడట. ఇక వెన్నెలను వెదజల్లే చంద్రుడు .. ముత్యాలతో కూడిన శివలింగాన్ని అర్చిస్తూ ఉంటాడట. ఈ కారణంగానే వాళ్లు మరింత తేజస్సును పొందుతూ ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దేవతలతో పాటు ఎంతోమంది మహర్షులు .. మహా భక్తులు ఆ స్వామిని అనునిత్యం సేవిస్తూ తరిస్తున్నారు.      


More Bhakti News