శివ పార్వతుల కల్యాణోత్సవ దర్శనం

మాఘ బహుళ చతుర్దశియే మహాశివరాత్రి. ఈ పర్వదినం రోజున శైవ క్షేత్రాలన్నీ కూడా భక్త జన సందోహంచే సందడిగా కనిపిస్తుంటాయి. పూజాభిషేకాలచే .. దీపకాంతులచే స్వామి ఆలయాలన్నీ కళకళలాడుతూ దర్శనమిస్తుంటాయి. ఈ రోజున భక్తులంతా కూడా ఉపవాస దీక్షను చేపట్టి, శివనామ స్మరణతో జాగరణ చేస్తుంటారు.

 ఈ రోజున స్వామివారిని మారేడు దళాలతో పూజించి .. 'పొంగలి'ని నైవేద్యంగా సమర్పించడం వలన స్వామి ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఆలయాలలో స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులంతా ఆలయానికి తరలివస్తారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని తిలకించడం వలన, సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు.  


More Bhakti News