కోరికలు నెరవేర్చు సదాశివుడు

మహా శివరాత్రి పర్వదినం దగ్గర పడుతుండటంతో, శివాలయాలన్నీ కూడా భక్తుల రద్దీని  తట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మహా శివరాత్రి రోజున భక్తులంతా ఉపవాస దీక్షను చేపట్టి .. శివ నామ స్మరణతో జాగరణ చేస్తుంటారు. శివుడు కొలువైన క్షేత్రాల్లో జాగరణ చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి కనుక, అంతా శైవ క్షేత్రాలకి వెళుతుంటారు. ప్రసిద్ధి చెందిన ప్రాచీన క్షేత్రాలకి కొంతమంది వెళితే, తమకి దగ్గరలో గల ఆలయాలకు మరికొంత మంది వెళుతుంటారు.

 అలా శివరాత్రి రోజున భక్తుల సందడితో కనిపించే ప్రాచీన క్షేత్రాల్లో 'వేముల పల్లి' ఒకటి. ఇది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలో దర్శనమిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం రేచర్ల రెడ్డి రాజులు ఇక్కడి స్వామికి ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన .. సమస్త పాపాలు నశించి పుణ్య ఫలాలు లభిస్తాయనీ, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 


More Bhakti News