శివ క్షేత్ర దర్శనం

లోక కల్యాణం కోసం పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. భక్తుల కోసం స్వామి స్వయంభువుగా కొలువైన క్షేత్రాలు కొన్నైతే, భక్తులు పూనుకుని స్వామివారిని ప్రతిష్ఠించుకున్న ఆలయాలు మరికొన్ని. ఈ క్షేత్రాలన్నీ కూడా సోమవారాల్లోను .. విశేషమైన పుణ్య దినాల్లోను భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం రోజున భక్తులతో రద్దీగా దర్శనమిస్తుంటాయి.

 పరమశివుడు పంచభూతాత్మక స్వరూపుడిగా వెలిశాడు. కంచిలో 'పృథ్వీలింగం'గా .. తిరువణ్ణామలై లో 'తేజో లింగం'గా .. జంబుకేశ్వరంలో 'జలలింగం'గా .. శ్రీకాళహస్తిలో 'వాయులింగం'గా .. చిదంబరంలో 'ఆకాశలింగం'గా ఆవిర్భవించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన శైవ క్షేత్రాలుగా 'పంచారామాలు' దర్శనమిస్తుంటాయి. 'ద్రాక్షారామం' .. 'క్షీరారామం' .. 'సోమారామం' .. 'అమరారామం' .. 'కుమారారామం' క్షేత్రాలు ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. మహా శివరాత్రి పర్వదినం రోజున ఈ క్షేత్రాలలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.        


More Bhakti News