కిరాతార్జునీయం ఇక్కడే జరిగిందట!
పూర్వం అర్జునుడు 'పాశుపతాస్త్రం' సాధించాలనే పట్టుదలతో పరమశివుడి కోసం తపస్సు చేశాడు. అర్జునుడిని పరీక్షించడం కోసం శివుడు చెంచు వేషధారణలో వస్తాడు. ఒక అడవి పందిని తాను ముందుగా వేటాడానంటే .. తాను ముందుగా వేటాడానంటూ ఇద్దరి మధ్య పోరు జరుగుతుంది. ఆ వచ్చింది పరమశివుడనే విషయం ఆ తరువాత అర్జునుడికి తెలిసి మోకరిల్లుతాడు. పరమశివుడి అనుగ్రహంతో 'పాశుపతాస్త్రం' అందుకుంటాడు.
ఆ సంఘటన జరిగిన ప్రదేశమే 'సలేశ్వరం'గా చెబుతుంటారు. నల్లమల అడవుల్లో .. అచ్చంపేటకి సమీపంలో సలేశ్వర క్షేత్రం దర్శనమిస్తుంది. సాక్షాత్తు పరమశివుడు తమ వేషధారణలో వచ్చాడు కనుక, ఇక్కడి చెంచులు స్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు. ఈ ప్రాంతాన్ని దర్శించడం వలన .. కిరాతార్జునీయం ఇక్కడే జరిగిందనే అనుభూతి చాలాకాలం పాటు మనతోనే ఉండిపోతుంది.