వెలికొండ వెనుక కథ ఇదే!
నరసింహస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో 'పెంచల కోన' ఒకటి. నెల్లూరు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి స్వామిని భక్తులు 'పెంచలయ్య'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో వారికి స్వామి ఇలవేల్పు. అందువలన చాలామంది 'పెంచలయ్య' పేరుతో కనిపిస్తుంటారు. ఇక్కడి కొండను 'వెలికొండ' అని పిలుస్తుంటారు.
అలా పిలవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. రామ .. రావణ యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు, 'సంజీవిని' కోసం హనుమంతుడు ఈ కొండ భాగాన్ని పెకిలించాడట. అయితే పర్వత భాగం చేతికి రాకుండా విరిగిపోయిందట. దాంతో రామ కార్యంలో వున్న తనకి సహకరించని కారణంగా, ఆ పర్వత శ్రేణి నుంచి ఆ భాగాన్ని వెలివేశాడట. అందువలన ఈ కొండను 'వెలికొండ'గా పిలుస్తుంటారు.