అమరేశ్వరుడే క్రౌంచనాథుడు

లోక కల్యాణం కోసం తారకాసురుడిని కుమారస్వామి సంహరించాడు. ఆ సమయంలో తారకాసురుడి మెడలోని 'అమృత లింగం' అయిదు భాగాలై అయిదు ప్రదేశాల్లో పడిపోయాయి. అలా అయిదు శివలింగాలు ఆవిర్భవించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలై 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి .. వాటిలో ఒకటి 'అమరారామం'.

అమరావతిగా చెప్పుకునే ఈ క్షేత్రంలో శివలింగం దాదాపు 15 అడుగుల పొడవును కలిగి ఉంటుంది. సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్టు చెప్పబడే ఈ శివలింగం తెల్లగా ఉండటం విశేషం. ఇక్కడి స్వామివారిని 'అమరేశ్వరుడు' గానే కాదు .. 'క్రౌంచ నాథుడు'గా కూడా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. స్వామివారు 'క్రౌంచగిరి'పై కొలువై వున్న కారణంగా, ఆయనని ఈ పేరుతో కొలుస్తుంటారు. కృష్ణా నదీ తీరంలోని ఈ క్షేత్రం దేవతలు తిరుగాడినదిగా చెప్పబడుతోంది. అలాంటి ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.     


More Bhakti News