అందుకే ద్రాక్షారామానికి ఆ పేరు

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో 'ద్రాక్షారామం' ఒకటి. కృత యుగంలో కుమారస్వామి .. తారకాసురుడిని సంహరించినప్పుడు, అతని మెడలోని అమృతలింగం అయిదు భాగాలై అయిదు ప్రదేశాల్లో పడింది. అవన్నీ కూడా పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి ఈ పంచారామాలలో 'ద్రాక్షారామం' ఒకటిగా చెప్పబడుతోంది.

ఇక్కడ ఆవిర్భవించిన పరమశివుడికి సాక్షాత్తు సూర్య భగవానుడు తొలిపూజ చేసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. చాళుక్య భీముడు స్వామివారికి ఆలయాన్ని పునఃనిర్మించాడు. దాంతో ఇక్కడి స్వామివారు భీమేశ్వరుడు పేరుతోనే పూజలందుకుంటున్నాడు. పూర్వం ఇది దక్ష ప్రజాపతి ఆరామం. అందువలన దక్షారామంగా పిలవబడుతూ ఉండేది. కాలక్రమంలో 'ద్రాక్షారామం'గా రూపాంతరం చెందింది. ఎత్తైన శిఖరాలతో .. పొడవైన ప్రాకారాలతో .. అందమైన మంటపాలతో ఈ ఆలయం, అలనాటి వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది.      


More Bhakti News