కోరికలు నెరవేర్చు కొండంత దేవుడు

కలియుగ దైవంగా వేంకటేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఆపదలను గట్టెక్కిస్తూ ఆపద మొక్కులవాడిగా విలసిల్లుతున్నాడు. భక్తుల కోసం స్వామి వెలసిన క్షేత్రాలు కొన్నైతే, అనునిత్యం ఆ స్వామి దర్శన భాగ్యం కలగడం కోసం భక్తులు నిర్మించుకున్న ఆలయాలు మరికొన్ని. ఎక్కడ చూసినా స్వామి వైభవంతో వెలుగొందుతూనే ఉంటాడు. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని 'రాయకుదురు'లో కనిపిస్తుంది.

భక్తుల సంకల్ప బలంతో స్వామివారు ఇక్కడ కొలువుదీరి దాదాపు 100 సంవత్సరాలు అవుతోంది. శ్రీదేవి - భూదేవి సమేతంగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తూ వుంటాడు. మూల మూర్తులు మహా తేజస్సుతో వెలుగొందుతూ, భక్తులకు అనిర్వచనీయమైన ఆనందానుభూతులను కలిగిస్తుంటాయి. వివాహం .. గృహప్రవేశం వంటి శుభకార్యాలకు మొదటి ఆహ్వానం స్వామివారికే అందుతుంది. ఆపదలు .. అనారోగ్యాలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు స్వామివారిని దర్శించుకుంటే చాలు, అవి గట్టెక్కుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి శనివారం రోజున .. విశేషమైన పర్వదినాల్లోను స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కోరికలు నెరవేర్చు కొండంత దైవాన్ని భక్తులు దర్శించుకుని .. సేవించుకుని ధన్యులవుతుంటారు.     


More Bhakti News