అహోబిల నారసింహుడు

హరి నామ స్మరణను ఎవరైతే చేస్తుంటారో వాళ్లని ఆ స్వామి వెన్నంటి రక్షిస్తూ ఉంటాడు అనడానికి ప్రహ్లాదుడి చరిత్రయే నిదర్శనం. భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ప్రత్యేక అవతారాన్ని ధరించడం ఈ ఘట్టంలో కనిపిస్తుంది. అలా హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కొలువైన క్షేత్రాలలో 'అహోబిలం' ఒకటి. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం పరిథిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.

ఎగువ 'అహోబిలం' .. దిగువ 'అహోబిలం'గా చెప్పుకునే ఈ క్షేత్రంలో నవనారసింహ రూపాలు కనిపిస్తుంటాయి. వాటిలో జ్వాలా నారసింహస్వామి మొదటిదిగా చెప్పబడుతోంది. స్వామి మూల మూర్తి హిరణ్య కశిపుడిని సంహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ స్వామి సన్నిధికి చేరువలో ఒక గుండం కనిపిస్తుంది. హిరణ్య కశిపుడిని  తన పదునైన గోళ్లతో సంహరించిన తరువాత, ఈ గుండంలో స్వామి చేతులు కడిగాడట. ఈ గుండంలో నీళ్లు ఇప్పటికీ ఎరుపు రంగులో ఉండటాన్ని అందుకు నిదర్శనంగా చూపుతుంటారు. స్వామివారి లీలా విశేషాలను కొనియాడుతూ వుంటారు.           


More Bhakti News