ఇంద్రుడిచే పూజించబడిన పురుహూతికాదేవి

దక్షుడు అవమానించిన కారణంగా సతీదేవి యోగాగ్నిలో తనువు చాలిస్తుంది. ఆమె మృత శరీరాన్ని భుజాన వేసుకుని శివుడు సంచరిస్తూ ఉంటాడు. ఆయనని ఆ వైరాగ్యం నుంచి బయటపడేయడానికి శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి మృత శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆమె శరీరం 108 ప్రదేశాలలో పడుతుంది.

 ఆ ప్రదేశాలన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి శక్తి పీఠాలలో 'పిఠాపురం' ఒకటి. అమ్మవారి 'పీఠభాగం' పడిన ప్రదేశం కనుక ఈ క్షేత్రాన్ని 'పిఠాపురం' అనీ .. అమ్మవారిని 'పీఠంబికా'అని పిలుస్తుంటారు. ఇక్కడి అమ్మవారిని 'పురుహూతికా దేవి'గాను కొలుస్తుంటారు. 'పురుహూతుడు' (దేవేంద్రుడు) పూజించిన కారణంగా అమ్మవారు  'పురుహూతికా దేవి'గా వెలుగొందుతున్నట్టు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి అమ్మవారు నాలుగు చేతులతో మహా తేజస్సుతో దర్శనమిస్తూ ఉంటుంది.      


More Bhakti News