బుగ్గ మాధవ వరం ప్రత్యేకత
సీతారాములు .. హనుమ .. లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి కొలువైన క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా 'బుగ్గ మాధవ వరం' కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లా ముక్త్యాల సమీపంలో విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ఒక నాటి వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది.
సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ, ఈ ప్రాంతానికి కూడా వచ్చారట. ఆ సమయంలో వారికి బాగా దాహం వేయడంతో, రాముడు ఈ ప్రదేశంలో నేలపై బాణం వేశాడట. ఆ బాణం గుచ్చుకున్న ప్రదేశం నుంచి నీరు ఉబికి రావడంతో దాహం తీర్చుకున్నారు. అలా ఏర్పడిన 'బుగ్గ' నుంచి ఈ నాటికీ నీరు వస్తూనే వుంది. ఈ కారణంగానే ఈ గ్రామానికి 'బుగ్గ మాధవవరం' అనే పేరు వచ్చిందని అంటారు. 'శ్రీరామ నవమి' .. 'హనుమజ్జయంతి' పర్వదినాలకి ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.