కరవీరపురమే కొల్హాపురి

అష్టాదశ శక్తి పీఠాలలో 'కొల్హాపురి' ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీమహా లక్ష్మీ అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మహా శక్తిమంతమైన ఈ క్షేత్రంలో మహాలక్ష్మీ దేవి అధిష్టాన దేవత కాగా, పరమశివుడు నీరుగా ..  శ్రీ మహా విష్ణువు రాళ్లుగా .. మహర్షులు ఇసుకగా .. ఉంటారట. అందువలన ఈ క్షేత్రంలో స్నానమాచరించడం వలన సమస్త పాపాలు నశిస్తాయని చెబుతుంటారు.

ఈ క్షేత్రాన్ని 'కరవీరపురం' అనే పేరుతోనూ పిలుచుకుంటూ వుంటారు. అందుకు పురాణపరమైన ఒక కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ప్రళయ కాలంలో 'కొల్హాపురి' నీట మునిగిపోతూ ఉందట. అప్పుడు అమ్మవారు తన కరములతో ఈ క్షేత్రాన్ని పైకెత్తి పట్టుకుందట. అమ్మవారు ఈ క్షేత్రాన్ని కరములతో పైకెత్తినందువలన ఈ క్షేత్రానికి 'కరవీరపురం' అనే పేరు వచ్చిందని చెప్పబడుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందనీ, ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.   


More Bhakti News