పాపాలను తొలగించే కేశవస్వామి

శ్రీమహా విష్ణువు .. కేశవస్వామిగా కొలువైన క్షేత్రాలలో 'పెరవలి' ఒకటి. గుంటూరు జిల్లా వేమూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. గర్భాలయంలో స్వామివారు .. ఆ పక్కనే గల ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

ఇక్కడి స్వామి చోళరాజుల కాలంలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటూ వస్తున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఒక పాపం నుంచి విముక్తిని పొందడం కోసం, అప్పటి రాజు 48 ప్రదేశాలలో కేశవస్వామి ఆలయాలను నిర్మించి .. స్వామిని ప్రతిష్ఠించాడట. అలా ఆయన నిర్మించిన ఆలయాలలో ఇదే మొదటిదని చెబుతారు. మిగతా ఆలయాలు కేరళ వరకూ ఉన్నాయట . స్వామి దర్శన మాత్రం చేతనే పాపాలు పటాపంచలవుతాయని అంటారు. విశేషమైన రోజుల్లో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.     


More Bhakti News