అందుకే మత్స్య గిరికి ఆ పేరు
శ్రీ మహా విష్ణువు ధరించిన అవతారాలలో మొదటిది 'మత్స్యావతారం' బ్రహ్మదేవుడి అధీనంలో వున్న నాలుగు వేదాలను 'సోమకాసురుడు' అనే రాక్షసుడు అపహరించి, వాటిని సముద్రం అడుగుభాగాన దాచేస్తాడు. మత్స్య రూపాన్ని ధరించిన శ్రీ మహా విష్ణువు, సోమకాసురిడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు.
అలాంటి మత్స్య ఆకారంలో ఒక కొండ, నల్గొండ జిల్లా వలిగొండ మండలం పరిథిలో దర్శనమిస్తుంది. అందువలన ఇది 'మత్స్య గిరి' గా పిలవబడుతోంది. ఇక్కడి కొండపై లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరి కనిపిస్తాడు. స్వామివారిని మత్స్య గిరి నాథుడుగా భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడి కొలనులో గల చేపలు .. విష్ణు నామాలను సహజసిద్ధంగా కలిగి ఉండటం విశేషం. ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై వున్నాడని భక్తులు భావిస్తుంటారు. స్వామి వారి దర్శన మాత్రం చేత అనారోగ్యాలు .. ఆపదలు దూరమవుతాయని విశ్వసిస్తుంటారు.