నాటి వ్యాసపురమే నేటి బాసర

జ్ఞానమే ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది .. జ్ఞానమే కీర్తి ప్రతిష్ఠలను తీసుకొస్తుంది. జ్ఞానమే జీవితంలో అభివృద్ధికి .. ఆనందానికి కారణమవుతుంది. అలాంటి జ్ఞాన స్వరూపిణిగా సరస్వతీ దేవి కనిపిస్తుంది. ఆ తల్లి జ్ఞాన సరస్వతిగా వెలసిన క్షేత్రంగా 'బాసర' వెలుగొందుతోంది.

 అష్టాదశ పురాణాలను రచించిన వేద వ్యాసుడు ఈ ప్రదేశంలోనే సరస్వతీ దేవిని ఆరాధించాడని స్థల పురాణం చెబుతోంది. అందుకు నిదర్శనంగా ఇక్కడ 'వ్యాస గుహ' కూడా కనిపిస్తుంది. ఈ గుహలోనే ఆయన అమ్మవారిని పూజించగా .. ఆ తల్లి సాక్షాత్కరించిందని అంటారు. ఇక్కడి సమీపంలో గల గోదావరి నదీ తీరంలోని ఇసుకతోనే ఆయన అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. వ్యాసుడు నివసించిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి 'వ్యాసపురం' అనే పేరు వచ్చింది. ఆ తరువాత కాలంలో 'వాసర'గా .. 'బాసర'గా మారింది. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నతమైన స్థానాన్ని పొందుతారని అంతా విశ్వసిస్తుంటారు.     


More Bhakti News