కవచ తీర్థం ప్రత్యేకత

జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన పుణ్య క్షేత్రం 'రామేశ్వరం' అని అంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు పటాపంచలు అవుతాయని చెబుతారు. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు ఇక్కడి పుణ్య తీర్థాలలో తప్పకుండా స్నానమాచరిస్తారు.

రామేశ్వరం అనేక తీర్థాల సమాహారంగా కనిపిస్తుంది. ఒక్కో తీర్థం ఒక్కో ప్రత్యేకతను .. ఒక్కో విశేషాన్ని సంతరించుకుని దర్శనమిస్తుంది. అలాంటి పుణ్య తీర్థాలలో 'కవచ తీర్థం' ఒకటి. ఈ కవచ తీర్థంలో స్నానమాచరించడం వలన, జన్మజన్మలుగా వెంటవచ్చే పాపాలన్నీ నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన .. నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందట. నరక లోకానికి వెళ్లవలసిన అవసరం లేకుండా చేసే శక్తి ఈ తీర్థ స్నానానికి ఉందనేది మహర్షుల మాట.        


More Bhakti News