పెరుగుతోన్న వీరభద్రుడు

దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడి జటా జూటం నుంచి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం అనేక ప్రదేశాల్లో ఆయన ఆవిర్భవించాడు. అలా వీరభద్రస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటిగా కనిపిస్తుంది. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో .. భారీ నిర్మాణాలతో .. శిల్పకళతో కూడిన మంటపాలతో ఈ ఆలయం కనిపిస్తుంది.

 వందల సంవత్సరాల చరిత్ర వున్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా వున్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామి వారి మూర్తి పెరుగుతూ ఉండటమే అందుకు నిదర్శనమని చెబుతుంటారు. ప్రతిష్ఠ నాటికి .. ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు వున్నాయి. అందువలన ఈ  క్షేత్రం మహిమాన్వితమైనదిగా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ స్వామిని ఆరాధించడం వలన ఆపదలు .. అనారోగ్యాలు దూరమవుతాయనీ, మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు భావిస్తుంటారు. 


More Bhakti News