నిస్వార్థ భక్తియే మోక్షాన్ని ప్రసాదిస్తుంది
జీవితంలో తమకి కావలసినవి సమకూరుస్తున్నవాడు భగవంతుడు .. తమని నడిపిస్తున్నవాడు భగవంతుడు అని చాలామంది విశ్వసిస్తుంటారు. తమకి శుభాలు కలగడంలో .. తాము ఆపదల నుంచి గట్టెక్కడంలో భగవంతుడి పాత్ర ఉందని నమ్ముతుంటారు. ఆయన పూజల్లో .. సేవల్లో అంకితభావంతో పాల్గొంటూ వుంటారు.
జీవితాన్ని ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తున్నవారి పట్ల భగవంతుడు ప్రేమను కలిగి ఉంటాడు. వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తుంటాడు. ఇక కొంతమంది భక్తులు భగవంతుడిని నుంచి ఏమీ ఆశించరు. ఆయన ఎదుట నిలిచి ఎలాంటి కోరికలను వ్యక్తం చేయరు. పేదరికాన్ని అనుభవిస్తున్నా సిరిసంపదలను గురించి ఆలోచన చేయరు. కష్టాలు పడుతున్నా సుఖాల పట్ల ఆసక్తిని చూపరు. భగవంతుడి సేవలోనే ఆనందం .. ఐశ్వర్యం ఉన్నాయని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తుంటారు. అలా నిస్వార్థ భక్తితో భగవంతుడిని ఆరాధించి .. మోక్షాన్ని పొందిన మహా భక్తులు ఎంతోమంది వున్నారు.