అష్ట సోమేశ్వర క్షేత్రాలు
భక్తుల కోరిక మేరకు పరమశివుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. ఆ ప్రదేశాలన్నీ కూడా పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలుగా అలరారుతున్నాయి. మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో 'అష్ట సోమేశ్వర క్షేత్రాలు' మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి.
కోటిపల్లి .. కోరుమిల్లి .. కోలంక .. సోమేశ్వరం .. పెనుమళ్ల .. వెల్ల .. .. వెంటూరు .. దంగేరు 'అష్ట సోమేశ్వర క్షేత్రాలు'గా వెలుగొందుతున్నాయి. సాక్షాత్తు పరమశివుడి సూచన మేరకు వశిష్ఠుడు .. విశ్వామిత్రుడు .. జమదగ్ని .. అత్రి మహర్షి .. కశ్యపుడు .. భరద్వాజ మహర్షి .. గౌతముడు .. ఈ ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. శివుడు ఈ క్షేత్రాల్లో ప్రత్యక్షంగా కొలువై వున్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్రాలను దర్శించడం వలన సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరుతాయని భావిస్తుంటారు.