ముక్తిని ప్రసాదించే శివ నామ స్మరణ

పరమశివుడు మహా దయా సాగరుడు. ప్రేమతో పూజిస్తే చాలు .. కరుణతో కరిగిపోతాడు. అంకితభావంతో అభిషేకం చేస్తే చాలు .. అమ్మలా కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అలాంటి శంకరుడు తనని సేవించేవారి వెన్నంటే ఉంటాడు. భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో వున్నా, తన నామాన్ని స్మరిస్తే చాలు ఆయన మురిసిపోతాడు .. పరవశించిపోయి పరిగెత్తుకు వస్తాడు.

 శివనామ మహిమ అపారమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివనామ స్మరణ వలన ముక్తి లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. 'శి' అంటే మంగళం .. '' అంటే అనుగ్రహించేవాడని అర్థం. శుభాలను ప్రసాదించేవాడే శంకరుడు అని చెప్పబడుతోంది. జన్మజన్మలుగా వెంట వచ్చే పాపాలు, శివ నామాన్ని స్మరించడం వలన పటాపంచలవుతాయి. సమస్త దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాలు .. అకాల మృత్యువు దరి చేరవు. కాశీ క్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టినవారికి కలిగే ముక్తి, అనునిత్యం తన నామాన్ని స్మరించేవారికి  కలుగుతుందని సాక్షాత్తు పరమశివుడు పార్వతీ దేవికి చెప్పడమే ఇందుకు నిదర్శనం.       


More Bhakti News