కష్టాలను తొలగించే శ్రీపాద శ్రీవల్లభులు

అష్టాదశ శక్తి పీఠలలో ఒకటిగా .. పాదగయగా .. పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా .. కుక్కుటేశ్వరస్వామి క్షేత్రంగా .. దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల క్షేత్రంగా 'పిఠాపురం' వెలుగొందుతోంది. సుమతి - రాజశర్మ దంపతుల కోరిక మేరకు సాక్షాత్తు దత్తాత్రేయుడే, వారి పుత్రుడైన శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారని స్థల పురాణం చెబుతోంది. అందువలన ఇది మహిమాన్వితమైన గురు క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.

ఈ క్షేత్రాన్ని దర్శించినవారు ఇక్కడ తప్పకుండా 'గురుచరిత్ర'ను పారాయణం చేయవలసి ఉంటుంది. మనసును స్వామి వారి పాదాల చెంత సమర్పించి 'గురుచరిత్ర'ను పారాయణ చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. కష్టాల నుంచి .. ఆపదల నుంచి స్వామి గట్టెక్కిస్తాడు. అనారోగ్య సమస్యలు .. ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. సిరిసంపదలతో పాటు ఆయురారోగ్యాలు చేకూరతాయి. అందువలన 'పిఠాపురం' క్షేత్రాన్ని దర్శించిన వాళ్లు స్వామివారి సన్నిధిలో 'గురుచరిత్ర'ను పారాయణం చేయడం మరిచి పోకూడదు.


More Bhakti News