పట్టిసాచలం క్షేత్రానికి అందుకే ఆ పేరు!

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాచీనమైనటు వంటి పుణ్యక్షేత్రాల్లో 'పట్టిసాచలం' క్షేత్రం ఒకటి. వీరభద్రుడు లింగరూపంలో కొలువైవుండటం ఇక్కడి ప్రత్యేకత. 'పట్టిసం' అనేది ఒక రకమైన ఆయుధం పేరు. అలాంటి పేరు ఈ క్షేత్రానికి రావడానికి కారణంగా పురాణ సంబంధమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది.

దక్షుడు తాను తలపెట్టిన యాగానికి పరమశివుడిని ఆహ్వానించకపోగా, అక్కడికి వచ్చిన 'సతీదేవీ'ని అవమానపరుస్తాడు. భర్త మాటను కాదని వచ్చిన సతీదేవి యోగాగ్నిలో ప్రాణ త్యాగం చేస్తుంది. ఆ విషయం తెలిసిన పరమశివుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన జటా జూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. దక్ష యాగాన్ని ధ్వంసం చేసి, ఆయనని సంహరించమని ఆదేశిస్తాడు. పరమశివుడు ఆదేశించిన ప్రకారం వీరభద్రుడు 'పట్టిసం' అనే ఆయుధంతో దక్షుడి తలను ఖండిస్తాడు. ఆ సమయంలో 'పట్టిసం' వెళ్లి దేవకూట పర్వతంపై పడుతుంది. 'పట్టిసం' పడిన ప్రదేశం కనుక, ఈ క్షేత్రానికి 'పట్టిసం' అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.


More Bhakti News