ముక్తిని ప్రసాదించే శివ దర్శనం

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో పంచకేదారాలు .. పంచభూత లింగాలు .. పంచారామాలు ప్రముఖంగా కనిపిస్తాయి. కేదారనాథ్ .. తుంగనాథ్ .. రుద్రనాథ్ .. మధ్య మాహేశ్వర్ .. కల్పనాధ్ క్షేత్రాలు 'పంచకేదారాలు'గా విలసిల్లుతున్నాయి.

కంచిలో 'పృథ్వీ లింగం .. జంబుకేశ్వరంలో 'జలలింగం' .. తిరువణ్ణామలై'లో 'తేజో లింగం' .. శ్రీకాళహస్తిలో 'వాయులింగం' .. చిదంబరంలో 'ఆకాశలింగం' దర్శనమిస్తుంటాయి. ఇక అమరారామం .. సోమారామం .. క్షీరారామం .. కుమారారామం .. భీమారామం .. పంచారామ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఈ క్షేత్రాలన్నీ కూడా పరమశివుడు ప్రత్యక్షంగా కొలువైనవిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాలు ఎంతటి విశిష్టమైనవో .. అంతటి మహిమాన్వితమైనవనీ, ఏ క్షేత్రాన్ని దర్శించినా ముక్తి లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News