జటా తీర్థం ప్రత్యేకత అదే!

రామేశ్వరం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. దర్శన మాత్రం చేతనే ధన్యులను చేసే దివ్య క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రాలలో రామేశ్వరం ముందు వరుసలో ఉంటుంది. రామేశ్వరం అనేక తీర్థాలతో విలసిల్లుతూ ఉంటుంది. ఒక్కో తీర్థం ఒక్కో విశేషాన్ని .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అందువలన రామేశ్వరం వెళ్లిన భక్తులంతా ఆయా తీర్థాలలో స్నానమాచరిస్తూ వుంటారు.

అలాంటి తీర్థాలలో 'జటా తీర్థం' ఒకటిగా చెప్పబడుతోంది. రామేశ్వరానికి సమీపంలో ఈ తీర్థం వుంది. సీతాదేవిని అపహరించిన రావణుడికి, రాముడు ఎన్నో విధాలుగా చెప్పిచూశాడు. అయినా అధర్మ మార్గాన్ని ఆశ్రయించే రావణుడు వున్నాడు. దాంతో రావణుడిని రాముడు సంహరించాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన రాముడు, తన జటలను ముందుగా ఈ తీర్థంలో తడిపి స్నానం చేశాడట. అప్పటి నుంచి ఇది 'జటా తీర్థం'గా పిలవబడుతోంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News