కోటి తీర్థంలో స్నానమాచరిస్తే చాలు

జీవితంలో ఒక్కసారైనా రామేశ్వర క్షేత్రాన్ని దర్శించాలని పెద్దలు చెబుతుంటారు .. అంతటి దివ్య క్షేత్రం రామేశ్వరం. ఇక్కడ ఎన్నో తీర్థాలు ఆవిర్భవించాయి. ఆలయ ప్రాంగణంలో కొన్ని .. పరిసర ప్రాంతాల్లో కొన్ని దర్శనమిస్తుంటాయి. ఒక్కో తీర్థం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడి తీర్థాలలో 'కోటి తీర్థం' ఒకటిగా దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువైన విశాలాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఈ తీర్థం దర్శనమిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు పటాపంచలైపోతాయని చెప్పబడుతోంది. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుడిని సంహరించిన తరువాత, ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి ఈ తీర్థంలో స్నాన మాచరించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News