పరశురాముడిని స్మరిస్తే విజయమే!

జీవితంలో విజయం ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. విజయమే అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. విజయమే కీర్తిప్రతిష్ఠలతో పాటు సిరిసంపదలను ప్రసాదిస్తుంది. అలాంటి విజయం పరశురాముడిని స్మరించడం వలన చేకూరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

దశావతారాలలో ఒకటిగా పరశురామావతారం కనిపిస్తుంది. ఎన్నో పుణ్య ప్రదేశాలలో పరశురాముడు శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. అవన్నీ కూడా పుణ్య క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి పరశురాముడి జయంతి రోజున ఆయనని సేవించడం వలన, విజయాలు లభిస్తాయి. మార్గశిర బహుళ విదియ రోజు పరశురామ జయంతిగా చెప్పబడుతోంది. అలాంటి ఈ పుణ్య దినాన ఆయనని స్మరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు తొలగిపోయి, విజయాలు చేకూరుతాయి.


More Bhakti News