ఆయురారోగ్యాలు ప్రసాదించే దత్తాత్రేయుడు
అత్రి మహర్షి - అనసూయ దంపతులకు త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుడు జన్మించాడు. ఆయన అవతరించిన 'మార్గశిర శుద్ధ చతుర్దశి' రోజు .. 'దత్త జయంతి'గా చెప్పబడుతోంది. దత్తాత్రేయులవారు త్రిమూర్తుల అంశగా జన్మించిన కారణంగా, ఆ స్వామిని సేవించడం వలన త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది.
దత్తాత్రేయుల వారిది జ్ఞాన స్వరూపం .. ఎంతోమంది దేవతలకు .. మహర్షులకు ఆయన జ్ఞాన బోధ చేశాడు. సమస్త జీవరాసుల జీవన విధానంలో నుంచి జ్ఞానాన్ని గ్రహించమని ఆయన చెప్పాడు. అలా ఆయన గురు స్థానాన్ని అలంకరించి .. పూజించబడుతున్నాడు. ఆయనకి గురువారం అంటే ఎంతో ప్రీతి కనుక, స్వామి ఆలయాలన్నీ ఆ రోజున భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఇక దత్త జయంతి రోజున ఆ స్వామిని పూజించడం వలన .. దత్త పారాయణం చేయడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు. జ్ఞానంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.