కష్టాలను గట్టెక్కించే హనుమంతుడు
శ్రీరామచంద్రుడి పరమభక్తుడిగానే కాదు .. దైవంగాను హనుమంతుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అనేక నామాలతో సేవించబడుతుంటాడు. రామలయాలలోనే కాకుండా .. ప్రత్యేకంగాను ఆ స్వామి కొలువై దర్శనమిస్తుంటాడు. హనుమంతుడికి దేవతలందరి అనుగ్రహం వుంది. అందువలన ఆయనని పూజించడం వలన, దేవతలందరినీ సేవించిన భాగ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలా ఆ స్వామి కొలువుదీరిన ఆలయాలలో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం 'కన్నాపురం'లో కనిపిస్తుంది. ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం కుదురుగా .. భక్తిభావ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. స్వామివారిని అంకితభావంతో పూజిస్తే చాలు .. ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. మంగళ .. శని వారాల్లో అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటారు. విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేక పూజలు .. సేవలు నిర్వహిస్తుంటారు.