రామేశ్వరంలోని పుణ్యతీర్థాలు

జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం 'రామేశ్వరం' అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామేశ్వరం అనేక తీర్థాల సమాహారం. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులంతా ఇక్కడి తీర్థాలలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటారు. ఎంతో సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో ఈ తీర్థాలు కనిపిస్తుంటాయి. ఒక్కో తీర్థం ఒక్కో విశేషాన్ని కలిగి ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ తీర్థాలలో స్నానం చేయడం వలన, పాపాలు .. శాపాలు .. దోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

మహాలక్ష్మీ తీర్థం .. సావిత్రీ తీర్థం .. గాయత్రీ తీర్థం .. సరస్వతీ తీర్థం .. గంగా తీర్థం .. యమునా తీర్థం .. సూర్యతీర్థం .. చంద్రతీర్థం .. చక్రతీర్థం .. శంఖ తీర్థం .. సేతుమాధవ తీర్థం .. శివ తీర్థం .. గంధమాధవతీర్థం .. నీల తీర్థం .. నల తీర్థం .. గయాతీర్థం .. గవయా తీర్థం .. బ్రహ్మహత్య పాతక విమోచన తీర్థం .. కవచతీర్థం .. సత్యామృత తీర్థం .. కోటి తీర్థం .. సర్వతీర్థం ఈ క్షేత్రంలో భక్తులను తరింపజేస్తుంటాయి.


More Bhakti News