కాలభైరవ ఆరాధన ఫలితం
ఒకసారి బ్రహ్మదేవుడు చేసిన అపరాధానికి ఆగ్రహించిన పరమశివుడు, కాలభైరవుడిని సృష్టిస్తాడు. శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ తలలలో ఒక దానిని కాలభైరవుడు ఖండిస్తాడు. ఆ పాపానికి పరిహారంగా ఏం చేయాలో చెప్పమని శివుడిని కోరతాడు. ఆదిదేవుని సూచన మేరకు అనేక క్షేత్రాలను దర్శిస్తాడు. చివరికి కాశీ క్షేత్రానికి చేరుకొని, అక్కడ క్షేత్ర పాలకుడిగా ఉండిపోతాడు.
అందువలన ప్రాచీన క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు, క్షేత్రపాలకుడిగా కాలభైరవుడి మూర్తి అక్కడ కనిపిస్తుంది. పరమశివుడితో పాటు ఆయన కూడా పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి కాలభైరవుడు ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమి రోజునే 'కాలభైరవాష్టమి' జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున శివాలయాలను దర్శించి పూజాభిషేకాలు జరిపించడం వలన .. కాలభైరవుడిని పూజించడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.