సుబ్రహ్మణ్యస్వామి పూజా ఫలితం

శివపార్వతులకు జన్మించిన కుమారస్వామినే సుబ్రహ్మణ్యుడు .. కార్తికేయుడు .. స్కందుడు .. ఇలా వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటూ వుంటారు. స్వామి సర్పరూపంలో ఆవిర్భవించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయన కొన్ని క్షేత్రాలలో సర్పరూపంలోను దర్శనమిస్తుంటాడు. కుమారస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి రోజుని 'సుబ్రహ్మణ్య షష్ఠి'గా చెబుతుంటారు.

ఈ రోజున ఆ స్వామిని ఆరాధించడం వలన, ఆయన మరింతగా ప్రీతి చెందుతాడు. అందువలన ఈ రోజున ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామిని పంచామృతాలతో అభిషేకించి .. కందిపప్పుతో చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. సర్ప .. రాహు .. కేతు .. కుజ దోషాలు ఉన్నవారు, ఈ రోజున స్వామిని పూజించడం వలన సత్ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News