ఈ రోజున గంగా స్నానం మరింత విశేషం

కార్తీక మాసం తరువాత వచ్చే మార్గశిర మాసం కూడా ఎన్నో విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. పుణ్య ఫలాల రాశిగా అనిపిస్తుంది. ఈ మాసం పరమాత్ముడి స్వరూపమని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే సెలవిచ్చాడు. అలాంటి ఈ మాసం ఆరంభమైన రోజున గంగా స్నానాన్ని ఆచరించడం వలన, కోటి సూర్య గ్రహణ స్నానాలు చేసిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

మార్గశిర శుద్ధ తదియ రోజు కూడా శివపార్వతులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున 'ఉమామహేశ్వర వ్రతం' ఆచరించవలసి వుంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శివపార్వతులు ప్రీతి చెందుతారు. ఈ వ్రతం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, పుణ్యఫలాలు లభిస్తాయి. ఆయురారోగ్యాలు .. సంతాన సౌభాగ్యాలు చేకూరతాయి. అందువలన మార్గశిర శుద్ధ తదియ రోజున 'ఉమామహేశ్వర వ్రతం' చేయడం మరువకూడదు.


More Bhakti News