దత్త స్తోత్రం పఠిస్తే చాలు
సాక్షాత్తు త్రిమూర్తులు అత్రి - అనసూయ దంపతులకు పుత్రుడుగా జన్మించారు. అలా త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయస్వామి జ్ఞాన స్వరూపుడిగా వెలుగొందుతూ, తన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దత్తాత్రేయస్వామి అనునిత్యం అనేక రూపాలలో తిరుగాడుతూ తన భక్తులను పరీక్షిస్తూ, ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన నామస్మరణ ఎక్కడ వినిపిస్తూ ఉంటుందో అక్కడికి ఆయన తప్పక చేరుకుంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఆపదలో వున్నా .. అవసరాల్లో వున్నా ఏడు మార్లు దత్తాత్రేయస్వామి నామాన్ని చెప్పుకుంటే చాలు, ఏడో సారికి ఆయన తన భక్తులను సమీపిస్తాడనేది మహర్షుల మాట. దత్తాత్రేయస్వామిని పూజించడం వలన త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుంతుంది. అందువల్లనే ఆ స్వామి క్షేత్రాలు భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. దత్త క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ 'దత్త పారాయణం' చేయడం మరిచిపోకూడదు. అనునిత్యం దత్త స్తోత్రం - దత్త కవచం పఠించడం వలన విశేషమైన ఫలితం కనిపిస్తుంది.