కార్తీక అమావాస్యన కమలా జయంతి
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండగా సాఫీగా సాగిపోవడానికి ధనం ఎంతో అవసరం. అవసరాలు తీరాలన్నా .. కష్టాల నుంచి గట్టెక్కాలన్నా .. ఆపదల నుంచి బయటపడాలన్నా డబ్బు ఉండాల్సిందే. డబ్బుతో అన్నింటినీ కొనలేకపోయినా .. చాలా అవసరాలు దానితోనే ముడిపడి ఉంటాయి. అందువలన సంపద విషయంలో అంతా ఎంతో జాగ్రత్తగా వుంటారు.
సంపదలు చేకూరడమనేది లక్ష్మీదేవి అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కారణంగానే ధనానికి కొరత లేకుండా ఉంటుంది. అలా ఆ తల్లి దయ ఉండాలంటే, అనునిత్యం పూజిస్తూ .. సేవిస్తూ ఉండాలి. ఇక విశేషమైన రోజుల్లో ఆ తల్లిని పూజించడం వలన మరింత త్వరగా ప్రీతిచెందుతుంది. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఆ తల్లిని పూజించడం మరువకూడదు. ఆ రోజున 'కమలా జయంతి' .. అందువలన లక్ష్మీపూజ చేయవలసి ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని సేవించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.