అందుకే తిరుమలగిరికి ఆ పేరు

శ్రీవేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా 'తిరుమల గిరి' కనిపిస్తుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పూర్వం భరద్వాజ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఆ మహర్షి అభ్యర్థన మేరకు వేంకటేశ్వరస్వామి పుట్టతో సహా వెలిశాడు. స్వామివారు కొండపై కొలువుదీరాడు. కొండ దిగువున 'మంగొల్లు' అనే ఊరు వుంది. ఇది అలివేలు మంగమ్మ ఊరుగా చెబుతుంటారు. 'మంగవోలు' కాలక్రమంలో 'మంగొల్లు'గా మారిందని అంటారు.

పెద్ద తిరుమలలో స్వామివారు కొండపైన .. దిగువున అలివేలు మంగాపురం వున్న తీరు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి 'తిరుమలగిరి' అనే పేరు వచ్చింది. తిరుమలలో మాదిరిగా ఇక్కడ కూడా భక్తులు మొక్కుబడిగా అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పిస్తుంటారు. కోరిన వరాలను ప్రసాదించే తండ్రిగా ఇక్కడి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు .. అంకితభావంతో సేవిస్తుంటారు.


More Bhakti News