కార్తీకంలో రావిచెట్టు ప్రదక్షిణ ఫలితం

కార్తీక మాసంలో నదీ స్నానం .. ఉపవాసం .. దీపదానం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన నదీ స్నానం చేసిన భక్తులు, శివకేశవులు కొలువైన ఆలయాలను భక్తిశ్రద్ధలతో దర్శిస్తుంటారు. ఈ మాసంలో శివమాలికా స్తోత్రం .. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన హరిహరుల అనుగ్రహం లభిస్తుంది.

ఈ మాసంలో సదాశివుడిని బిల్వ దళాలతోను .. విష్ణుమూర్తిని తులసీదళాలతోను .. లక్ష్మీదేవిని తామర పూలతోను పూజించడం శ్రేష్ఠం. ఈ మాసంలో తులసిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తులసి మొక్కలేనివారు తప్పనిసరిగా తులసిని నాటుకోవాలి. అలాగే విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఉసిరిక చెట్టును పూజించాలి. రావిచెట్టు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా చెబుతుంటారు. అందువలన ఈ మాసంలో రావిచెట్టుకు ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయనేది మహర్షుల మాట.


More Bhakti News